AP: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్(ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు. CWC, PPA నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను CBN దృష్టికి తీసుకెళ్లుతున్నట్లు స్పష్టం చేశారు.