US H-1B వీసా ఫీజులపై నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన లక్ష డాలర్ల వీసా ఫీజు USనే ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నారు. ఈ నిర్ణయం భారత్‌కు టర్బో ఛార్జ్లా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రతిభకు US తలుపులు మూసేయడం వల్ల.. అక్కడ ఏర్పడాల్సిన ల్యాబ్‌లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు భారతదేశానికి వస్తాయని అభిప్రాయపడ్డారు.