‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్లో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించాడు. తొలుత కథ విన్నప్పుడు విజువల్స్ విషయంలో సందేహాలు కలిగినా, గ్లింప్స్ చూశాక కార్తీక్ విజన్ అర్థమైందని తెలిపాడు. ‘కార్తీక్ అద్భుతమైన విజనరీ, ఆయన గురించి జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.