BPT: రేపల్లెలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం వెనుక నిర్మించనున్న నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి టీడీపీ నేత అనగాని శివప్రసాద్ గురువారం భూమిపూజ చేశారు. ఈ మండపం నిర్మాణం పూర్తయితే, ఆర్యవైశ్యులకు శుభకార్యాలు, వివాహాలు జరుపుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.