SKLM: ఏపీ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు ఎక్స్ గ్రేషియా శనివారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాగా, మిగిలిన 5 మంది ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని మంత్రి తెలిపారు.