W.G: పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్సైట్, 9552300009 వాట్స్యాప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.