TG: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు శంషాబాద్ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి HYDకు రావాల్సిన 16 విమానాలు, ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్లాల్సిన 15 విమానాలు కలిపి మొత్తం 31 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.