ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడ గ్రామస్థులు గురువారం పెళ్లికట్నం నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్బంగా పెందోర్ హీరాబాయి గణపత్ రావు కుమార్తె వివాహానికి గ్రామస్థులు చందా జమ చేసి రూ.14,000 ఆర్థిక సహాయం చేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి ఉంటే ఈ విధంగా సహాయానికి ముందుంటామని వారు పేర్కొన్నారు.