ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) టీమ్ తలపడుతోంది. మ్యాచ్లో భాగంగా మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు బ్యాటింగ్కు దిగింది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ(RCB) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. దీంతో ఢిల్లీ(DC) ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(Virat Kohli) 50 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో కోహ్లీ తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. కోహ్లీ తర్వాత డుప్లెసిస్ 22 పరుగులు, లోమ్రోర్ 26 పరుగులు, మాక్స్ వెల్ 24 పరుగులు చేశారు.
ఓ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు మూడు వికెట్లను కోల్పోయి 117 పరుగులే చేసింది. అందరూ ఆర్సీబీ 200 పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ జట్టు 136 పరుగులకు 6 వికెట్లను కోల్పోయింది. చివరికి 174 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DC) 175 పరుగులు చేస్తే విజయాన్ని అందుకుంటుంది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.