ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు MS ధోనీ కారుకు రాంచీ పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ఈ నెల 1న కాంకే రింగ్ రోడ్లోని బిర్సా వ్యవసాయ వర్సిటీ సమీపంలో అతని లగ్జర్ కార్ ఓవర్ స్పీడ్తో వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుపై చలానా జారీ చేశాయి. అయితే ఆ సమయంలో ధోనీ కారులో ఉన్నాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.