W.G: ఆక్వా రైతాంగానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీడు, సీడు ధరలను ప్రభుత్వం నియంత్రించాలని, నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీలు కొనసాగించాలని కోరారు.