»Bjp Leader Surendra Matiala Shot Dead In Delhis Dwarka
Surender Matiala: ఢిల్లీలో బీజేపీ నేత పై దుండగుల కాల్పులు
సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరిపారు.
Surender Matiala:ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ద్వారక ప్రాంతంలో ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్క సారిగా ఉలిక్కిపడింది. సమాచారం ప్రకారం, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపారు. సంఘటన జరిగిన సమయంలో బీజేపీ నేత పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. కాల్పుల తర్వాత ఆయన పరిస్థితి విషమంగా ఉండటంలో స్థానికంగా ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు(Doctors) చెప్పారు. ఆ బీజేపీ(BJP) నేత పేరు సురేంద్ర మతియాలా(Surender Matiala). సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్(Bike)పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరిపారు. సురేంద్రకు ఏమవుతుందో అర్థం కాకముందే అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఘటన జరిగిన వెంటనే నిందితులిద్దరూ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. సురేంద్ర హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారించినా ఎలాంటి సమాచారం దక్కలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారు కూడా షాక్‌కు గురయ్యారు.