AP: ఫేస్బుక్ పరిచయంతో పెళ్లైన మహిళ వ్యామోహంలో పడి నెల్లూరుకు చెందిన అశోక్(26) అనే యువకుడు కర్నూలు(D) పత్తికొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ బిజినెస్ పేరుతో దంపతులతో పరిచయం పెంచుకున్న అశోక్, ఆ మహిళను తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఉరేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.