కాంగోలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రుబయా కోల్టన్ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మందికిపైగా మృతిచెందారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ఈ గని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని రెబల్ గ్రూప్ పేర్కొంది.