KNR: కెనాల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన రామడుగు మండలంలో జరిగింది. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వరాల రాకేష్ (24) బుధవారం మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొక్కెర కుంట శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో కొంతమంది స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో కెనాల్ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.