సౌతాఫ్రికాతో సెమీస్లో న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి ధాటికి సఫారీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 10.2 ఓవర్లలోనే 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్(18), మిల్లర్ (6)లను రవీంద్ర పెవిలియన్ చేర్చగా.. దూకుడుగా ఆడుతున్న బ్రెవిస్(34)ను నీషమ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్, యాన్సన్ ఉన్నారు.