HYD: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఎహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొనే జట్లు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఇటలీ జట్టు నేడు హైదరాబాద్ చేరుకోగా క్రీడాశాఖ అధికారాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్ సహా ఎనిమిది దేశాల జట్లు బరిలో ఉన్నాయి.