MDCL: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి సంబంధించిన సీట్లను 210 నుంచి 500 వరకు పెంచింది. కావున జిల్లా SC కులాలకు చెందిన అర్హులైన విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఈనెల 31 వరకు ఈ-పాస్ వెబ్సైట్ https://www.tgepass.cgg.gov.in ద్వారా అప్లై చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు.