WGL: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుధవారం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు మైస సురేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ‘కెరీర్ గైడెన్స్’ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో పుస్తకాలను ముద్రించి అందజేసినట్లు తెలిపారు.