ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ACB విస్తుగొలిపే విషయాలు వెల్లడించింది. ఈ ఫార్ములా ఆపరేషన్ సంస్థకు ప్రభుత్వం రూ.44 కోట్లు బదిలీ చేసినట్లు తెలిపింది. దీనికి బదులుగా BRS పార్టీకి ఆ సంస్థ రూ. 44 కోట్లను బాండ్ రూపంలో అప్పగించినట్లు పేర్కొంది. దీంతో ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ.. గవర్నర్ అనుమతి కోరింది.