E.G: నిడదవోలు సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. నిడదవోలు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిడదవోలు ఎమ్మెల్యేగా ఏడాది కాలంలో దాదాపు రూ. 300 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరో రూ.180 కోట్ల పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.