MNCL: యూరియా బస్తాల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్‌లో రైతులు ఆందోళన నిర్వహించారు. మంగళవారం వారు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారుల సూచనల మేరకు వివిధ పంటలు వేశామని, అయితే యూరియా బస్తాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా లేకపోతే పంటల ఎదుగుదలపై ప్రభావం ఉంటుందన్నారు.