SRCL: ఆన్లైన్ కోచింగ్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బోయినపల్లి లోని తెలంగాణ మోడల్ స్కూల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆన్లైన్ తరగతులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని పిల్లలకు పోటీ పరీక్షలు రాసేందుకు ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణను అందిస్తున్నామన్నారు.