KRNL: అర్లీ ఖరీఫ్ పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఇవాళ ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకోవాలని ఆదేశించారు.