MBNR: దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో నూతన అంగన్వాడీ పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంగళవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.