MNCL: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించిందని ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభ నిర్వహిస్తోందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చాక కాలయాపన చేసిందని తెలిపారు.