KMR: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను నిత్యం మోసగిస్తూనే ఉన్నారు. తాజాగా పిట్లంకు చెందిన మహేష్ అనే యువకుడు ఇలాంటి మోసానికి గురయ్యాడు. మహేష్ వాట్సాప్‌కు వచ్చిన ఒక లింక్‌ను ఓపెన్ చేశాడు. ఆ లింక్ తెరవగానే అతడి బ్యాంకు ఖాతా నుంచి ఒక్కసారిగా రూ.10,800 కట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించి PS లో ఫిర్యాదు చేశాడు.