HYD: పాతబస్తీలోని జియాగూడ స్లాటర్ హౌస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్లాటర్ హౌస్ ఆధునీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాంగణంలో పేరుకుపోయిన మాంసం వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని, శుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.