CTR: జిల్లా పెద్దపంజాణి మండలం వీరపల్లి రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా సక్రమంగా అందుతుందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎలా పంపిణీ జరుగుతుందో పరిశీలించారు. ఏదైనా తేడా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.