MBNR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలలలో చేసి చూపించామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం పెద్దతండా నుంచి లోక్యాతండా వరకు రూ.కోటి 5లక్షల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని అన్నారు.