హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాంతార చాప్టర్-1’. ఈ సినిమా గతంలో వచ్చిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ‘డ్రీమ్ స్కిన్స్ ఇంటర్నేషనల్’ సంస్థ విడుదల చేయనున్నట్లు తాజాగా హోంబాలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.