‘క్రిష్ 4’ మూవీపై దర్శకుడు రాకేష్ రోషన్ అప్డేట్ ఇచ్చారు. బడ్జెట్ విషయంలో ఒత్తిడి కారణంగా ఇప్పటివరకు ఈ మూవీ స్టార్ట్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఎంత బడ్జెట్ అవుతుందనే దానిపై క్లారిటీ వచ్చిందన్నారు. ప్రస్తుతం దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం పట్టవచ్చని తెలిపారు. 2026లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని, 2027లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.