TG: హైదరాబాద్లోని నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్ LRS క్లియర్ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్ అనే వ్యక్తిని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.