ATP: రేపు అనంతపురానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నగరానికి చేరుకుని భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 30 మంది ఐపీఎస్లు, సుమారు 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సీఎం హెలీప్యాడ్, బహిరంగ సభాస్థలం, నగరమంతా పోలీసుల నిఘాలోకి వెళ్లింది.