NDL; ఎన్జీవో కాలనీలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన మహిళ హత్య ఘటన వివరాలను టూ టౌన్ సీఐ అస్రార్ భాష వెల్లడించారు. అనుమానంతో భార్య శిరీషను భర్త సాయినాథ్ శర్మ గొంతు కోసి హత్య చేశాడని చేప్పాడు. నిందితుడు పురోహితి వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని నిన్న రాత్రి కూడా గొడవపడ్డారని అనంతరం హత్యకు పాల్పడ్డాడని తెలిపారు.