NDL: ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి అన్నదాత పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. బనగానపల్లె నుంచి డోన్ ఆర్డీవో కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.