KRNL: ఉప రాష్ట్రపతి ఎన్నికలో కర్నూలు MP బస్తిపాటి నాగరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్లో ఎంపీ ఓటు వేశారు. బీజేపీ సారథ్యంలోని NDA అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి బరిలో ఉన్నారు.