బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలు వాడొద్దని, AIతో క్రియేట్ చేస్తున్న అశ్లీలత చిత్రాలను అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది..