ASR: డుంబ్రిగుడ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు చేయాలన్న అవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి కుటుంబం తమ చెత్తను వర్గీకరించి ఇవ్వాలన్న సూచనలు కార్మికులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.