ADB: తెలంగాణ కోసం జీవితం అంకితం చేసిన మహానుభావుడు కాళోజీ నారాయణ రావు అని తాంసి ఎంపీడివో మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 మంగళవారం కాళోజీ జయంతి పురస్కరించుకుని తాంసి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.