BHPL: చిట్యాలలో గత కొన్ని రోజులుగా బావులకు అమర్చిన విద్యుత్ మోటార్లను అపహరించిన రమేష్, వెంకటస్వామి అనే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ మోడల్ స్కూల్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో 6 విద్యుత్ మోటార్లు, రూ.20 వేల నగదుతో దొరికిన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం అంగీకరించిన వారి పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.