NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ AIG ఆసుపత్రి, స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో రోగులకు బీపీ, షుగర్ లివర్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.