KRNL: పట్లణంలోని 11వ వార్డు నెహ్రూ రోడ్డులో సిమెంట్ రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని SDPI నాయకుడు జహంగీర్ ఆరోపించారు. పనులు నాణ్యతతో చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి ఇచ్చారు.