SRPT: కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరగడంతో మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ రక్షణ కోసం నిర్మించిన కరకట్ట 15 చోట్ల లీకేజీ అవడంతో మంగళవారం ఆలయ ప్రాంగణంలో అడుగు మేర నీరు నిలిచిపోయింది. ఆలయ అధికారులు, ధర్మకర్తలు వెంటనే స్పందించి, 15 HP మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుతూ యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు.