సత్యసాయి: కదిరి జీమాన్ సర్కిల్లో రహదారిపై సోమవారం రాత్రి వీధి కుక్కలు హల్చల్ చేశాయి. దీంతో కుక్కల బెడదతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు రహదారిపై వెళ్లడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. వాటి దాడికి గురై అనేక మంది గాయపడుతున్నారని, సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరారు.