MNCL: మందమర్రి పట్టణంలోని బురుద గూడెంలో ఈనెల 13న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అండర్-15 విద్యార్థులకు చదరంగం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఛైర్మన్ ఈగ కనుకయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 6305502409 నంబర్ సంప్రదించాలన్నారు.