W.G: మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌కు రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆయన ‘ఆ పదవి నాకు వద్దు’ అంటూ ఓ ప్రకటన స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీలో కష్టపడుతున్నానని అనేక పదవులు ఇచ్చి తగిన గౌరవం కల్పించారన్నారు. అయితే ఈ పదవిని స్వీకరించలేకపోతున్నానని పార్టీ కోసం ఊపిరి ఉన్నంతవరకు పనిచేస్తానన్నారు.