ADB: ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం బాసర ఆలయంలో పూజల అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను, ఆర్జీయూకేటీని సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారని సంబంధిత అధికారులు తెలిపారు. సోన్ నుంచి ధర్మారం వరకు వరద నష్టాన్ని పరిశీలించి సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.