పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే.. హీరోయిన్లకు అంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి లేనట్టే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వినోదయ సీతమ్ రీమేక్‌లో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్‌కు మాత్రమే హీరోయిన్లు ఉన్నారు. పవన్‌కు ఉన్నారో లేదో ఇప్పుడే చెప్పలేం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల్లో హీరోయిన్లు ఎవరనేది ఇంట్రిస్టింగ్గా మారింది. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూట్లో యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఉస్తాద్ సరసన శ్రీలీల ఫిక్స్ అయిపోయినట్టే. అయితే నెక్స్ట్ షూటింగ్‌కి రెడీ అవుతున్న ఓజిలో హీరోయిన్ ఎవరనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ బ్యూటీనే డైరెక్టర్ సుజీత్‌కు ఫస్ట్ ఆప్షన్‌గా ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే.. ప్రియాంక బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. మరి ఓజి హీరోయిన్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.