GNTR: తాడేపల్లి పరిధిలోని గుండిమెడలో రోడ్లపైకి చేరుతున్న మురుగునీరు సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి గ్రామంలోని పారిశుద్ధ్య సమస్యను ఆయన పరిశీలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయన్నారు.